పిల్లలు పక్క తడిపేస్తుంటే ఇలా చేసిచూడండి!

  • రాత్రుళ్లు నిద్రలోనే మూత్ర విసర్జన..
  • తడిసిన బెడ్ లో పడుకోవడం వల్ల అనారోగ్యాలు
  • న్యుమోనియా బారినపడే ప్రమాదం 
  • పక్క తడిపే అలవాటును మాన్పించేందుకు వంటింటి చిట్కాలు
ఏడాది, రెండేళ్ల వయసున్న చిన్నారులు నిద్రలోనే మూత్ర విసర్జన చేయడం సహజమే.. అయితే, వయసు పెరుగుతున్నా సరే ఈ పక్క తడిపే అలవాటు కొంతమంది పిల్లల్లో అలాగే కొనసాగుతుంది. ఐదారేళ్లు వచ్చినా పిల్లలు పక్కతడిపేస్తుంటే దానిని బెడ్ వెట్టింగ్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా నిద్రలో మూత్రం పోయడం వల్ల వారి బెడ్ తడిసిపోతుంది, అందులోనే పడుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యాలకు గురవుతుంటారు. ముఖ్యంగా న్యుమోనియా బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

బెడ్ వెట్టింగ్ కు కారణమేంటి..
బెడ్ వెట్టింగ్ సమస్యకు పిల్లల్లో మూత్రాశయం తగినంతగా అభివృద్ధి చెందకపోవడం కూడా ఓ కారణమని, మూత్రాన్ని నియంత్రించే నరాలు పరిపక్వం చెందకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. గాఢనిద్రలో ఉన్నపుడు పిల్లలు తెలియకుండానే మూత్ర విసర్జన చేస్తారని వివరించారు. పిల్లల్లో ఈ అలవాటును కొన్ని చిట్కాలతో మాన్పించవచ్చని తెలిపారు. 

అవేంటంటే..

  • 5-6 సంవత్సరాల పిల్లలు కూడా రాత్రిపూట పక్క తడిపితే, రాత్రి నిద్రిస్తున్నప్పుడు పిల్లల చిటికెన వేలును నొక్కండి. దీనివల్ల పిల్లవాడు మూత్రవిసర్జనను నియంత్రించడం నేర్చుకుంటాడు.
  • సమస్య మరీ ఎక్కువగా ఉంటే రాత్రి పడుకునే ముందు పిల్లలకు పటిక బెల్లం ముక్కతినిపించండి.
  • ఖర్జూరాలను పాలల్లో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ పాలను మరిగించి, చల్లారిన తర్వాత అందులోని ఖర్జూరాలను పిల్లలకు తినిపించాలి.
  • అలారం పెట్టుకొని పిల్లలను మధ్య రాత్రి నిద్రలేపి టాయిలెట్ కు వెళ్లమని చెప్పాలి. కొన్నిరోజులకు నిద్రలో మూత్రం వచ్చినపుడు పిల్లలు తమకుతాముగా నిద్రలేస్తారు.


More Telugu News