గూగుల్ ఉద్యోగులకు కొత్త రూల్.. డెస్క్ షేరింగ్

  • క్లౌడ్ ఉద్యోగులకు గూగుల్ సీఈవో పిచాయ్ సూచన
  • వ్యయాల పొదుపు చర్యలపై దృష్టి
  • ఇప్పటి వరకు 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఆర్థిక ప్రతికూలతలు ఉద్యోగులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు లక్షలాది మందిని ఇంటికి పంపించేశాయి. ఇప్పుడు మరింతగా వ్యయాల తగ్గింపుపై దృష్టి పెడుతున్నాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. తమ డెస్క్ ను తోటి ఉద్యోగులతో పంచుకోవాలని కోరినట్టు సమాచారం. వ్యయాల పొదుపునకు గూగుల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఇప్పటికే 12 వేలకు పైగా ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ‘‘ఉద్యోగులు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని తెలుసు. డబ్బులు ఆదా చేయడానికీ కృషి చేస్తున్నారు. అదే సమయంలో వనరులను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి’’ అని పేర్కొన్నారు. అయితే, డెస్క్ ల షేరింగ్ నిబంధన ప్రస్తుతానికి క్లౌడ్ డివిజన్ కే పరిమితం కానుంది. వనరులను చాలా పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయకూడదని సుందర్ పిచాయ్ సూచించారు.


More Telugu News