సర్వనాశనం.. బూడిదకుప్పగా మారిన ఉక్రెయిన్ సిటీ!
- డొనెట్స్క్ నగరం డ్రోన్ ఫొటోలు విడుదల చేసిన ఉక్రెయిన్
- రష్యా దాడిలో సిటీ మొత్తం నాశనమైందని ఆవేదన
- మారింకా సిటీ 4 నెలలపాటు రష్యన్ల చెరలో ఉందని వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఇరువైపులా సైనికులు, పౌరులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఉక్రెయిన్ లోని నగరాల్లో ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలే కనబడుతున్నాయి. డొనెట్స్క్ రీజియన్ లోని మారింకా సిటీ మొత్తం సర్వనాశనమైందని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధానికి ముందు ఈ సిటీలో పదివేల మంది నివసించేవారని తెలిపింది. రష్యా బాంబు దాడిలో మారింకా మొత్తం బూడిదకుప్పగా మారిపోయిందని వివరించింది. సిటీలో శిథిలాలు తప్ప ఏమీ మిగల్లేదని చెబుతూ.. మారింకా సిటీని డ్రోన్ కెమెరా ద్వారా తీసిన ఫొటోలను విడుదల చేసింది.
ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఈ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. సిటీలోని ఇళ్లు, ఇతర కట్టడాలు మొత్తం నేలమట్టమైన దృశ్యాలు ఆ ఫొటోలలో కనిపిస్తున్నాయి. యుద్ధానికి ముందు మారింకా చాలా ప్రశాంతంగా ఉండేదని, పదివేల మందికి పైగా జనాభా నివసించేవారని పేర్కొంది. రష్యాకు చెందిన యుద్ధ నేరస్థులు మారింకాలో దేనినీ వదిలిపెట్టలేదని, అన్నింటినీ ధ్వంసం చేసి వెళ్లారని తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భాగాలలో మారింకా కూడా ఉంది. నాలుగు నెలల పాటు రష్యా అధీనంలో ఉన్న ఈ సిటీలో చెట్టూచేమా, ఇళ్లూ వాకిళ్లూ.. ఇలా అన్నింటినీ ధ్వంసం చేశారు.