ఒక్క మిస్స్ డ్ కాల్ తో పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు!

  • ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో డబ్బు విత్ డ్రా చేసుకునే వీలు
  • అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే ఖాతాలో సొమ్ము జమ
  • అధిక పెన్షన్ కోసం దరఖాస్తు గడువు మే 3 వరకు పొడిగింపు
నెలనెలా జీతంలో నుంచి కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అవుతుందనే విషయం తెలిసిందే.. అయితే, ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం ఎంతుందనే విషయం ఎలా తెలుసుకోవాలో ఇప్పటికీ చాలామంది ఉద్యోగులకు తెలియదు. పీఎఫ్ ఆఫీసుకు వెళ్లి విచారించడమే మార్గమని భావిస్తుంటారు. అయితే, దీనికోసం పీఎఫ్ ఆఫీసు దాకా వెళ్లక్కర్లేదు. జస్ట్, ఒక్క మిస్స్ డ్  కాల్ తో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో 9966044425 నెంబర్ కు కాల్ చేస్తే, రెండు రింగ్ ల తర్వాత కాల్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఆ తర్వాత పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ వివరాలతో మెసేజ్ వస్తుంది.

పీఎఫ్ ఖాతాలో నుంచి సొమ్ము విత్ డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం సహా ఇతరత్రా పనులను ఇప్పుడు ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ చక్కబెట్టుకోవచ్చు. ఆఫీసుకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిచేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే మీ ఖాతాలో సొమ్ము జమవుతుందని అధికారులు చెబుతున్నారు. పీఎఫ్ ఖాతాలో నుంచి డబ్బు ఉపసంహరణకు యూఏఎన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, పాన్ కార్డ్ వివరాలు అందజేయాల్సి ఉంటుందని వివరించారు. కాగా, అధిక మొత్తం పెన్షన్ కోసం దరఖాస్తు గడువును మే 3 వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.


More Telugu News