నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరం

  • మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని వనీ బొగ్గు క్షేత్రంలో ఘటన
  • రైలు ఇంజిన్ పైనుంచి దూకబోయి హైటెన్షన్ వైర్లు తగిలి చిరుత మరణించి ఉంటుందని అనుమానం
  • పరీక్షల కోసం చిరుత కళేబరం చంద్రపూర్‌కు తరలింపు
నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరం కనిపించడం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని వనీ బొగ్గు గని క్షేత్రంలో జరిగిందీ ఘటన. ఇక్కడి గుగ్గూస్ రైల్వే సైడింగ్ వద్ద నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై నిన్న చిరుత కళేబరాన్ని గుర్తించారు. రైల్వే అధికారి రాజేశ్ సింగ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అటవీ అధికారులకు తెలియజేశారు. 

చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు పరీక్షల కోసం చంద్రపూర్ తరలించారు. చంద్రపూర్ థర్మల్ పవర్ స్టేషన్‌లోని బొగ్గును తరలిచేందుకు రైలు ఇంజిన్ అంతకుముందే వచ్చినట్టు అధికారులు తెలిపారు. రైలు ఇంజిన్ పైనుంచి దూకబోయిన చిరుత హైటెన్షన్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని భావిస్తున్నారు.


More Telugu News