సోదరులకు ఆస్తి దక్కకుండా భలే ప్లాన్.. భార్యను మళ్లీ పెళ్లాడుతున్న నటుడు!
- అప్పట్లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం
- కుమారులు లేకపోవడంతో ఆస్తిలో మూడో వంతు సోదరులకు చెందే అవకాశం
- ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం నేడు పునర్వివాహం
- ఫలితంగా ఆస్తి మొత్తం కుమార్తెలకు
కేరళకు చెందిన నటుడు, న్యాయవాది షుకూర్ నేడు తన భార్య షీనాను మళ్లీ పెళ్లాడబోతున్నారు. 29 సంవత్సరాల క్రితం.. అంటే 6 అక్టోబరు 1994లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో ఈ చట్టం ప్రకారం ఆయన ఆస్తిలో మూడింట ఒక వంతు అతని సోదరుల సొంతం కానుంది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ప్రత్యేక వివాహం చట్టం కింద వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ఉదయం 10 గంటలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఆయన ఆస్తి మొత్తం కుమార్తెలకే దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.