పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు తెరదీసింది: చంద్రబాబు
- ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
- టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- బోగస్ ఓట్లతో వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ
- పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్న చంద్రబాబు
ఏపీలో మార్చి 13న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు. బోగస్ ఓట్ల నమోదుతో వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. తప్పుడు పత్రాలతో ఓట్లు పొందిన వాళ్లు కూడా శిక్షార్హులేనని చంద్రబాబు హెచ్చరించారు. బోగస్ ఓటర్లపైనా, వారిని చేర్పించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బోగస్ ఓట్లపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. బోగస్ ఓట్లను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.