ప్రభుత్వ మాట వినం.. హామీలను లిఖితపూర్వకంగా ఇవ్వాలి: ఏపీజేఏసీ అమరావతి నేత బొప్పరాజు

  • మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒకటో తేదీనే జీతాలు వస్తున్నాయన్న బొప్పరాజు
  • ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న
  • సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు
తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలను వేస్తున్నారని... ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. 

అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, మాజీ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. సీపీఎస్ రద్దు చేయమని అడిగితే స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం చెప్పే మాటలు వినబోమని... ఏ హామీ అయినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నామని... ఈలోగా మంత్రుల కమిటీ ఏం చెపుతుందో చూస్తామని అన్నారు.


More Telugu News