కార్తికేయ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్!

  • కార్తికేయ హీరోగా 'బెదురులంక 2012'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ 
  • కథానాయికగా అలరించనున్న నేహా శెట్టి
  • సంగీతాన్ని సమకూర్చిన మణిశర్మ
కార్తికేయ తన సినిమాల్లో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలా ఈ సారి ఆయన ఈ రెండూ గ్రామీణ నేపథ్యంలో ఉండేలా చూసుకున్నాడు. ఆయన చేసిన ఆ సినిమా పేరే 'బెదురులంక 2012'. 

రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకి, క్లాక్స్ దర్శకత్వం వహించాడు. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు. 'వెన్నెల్లో ఆడపిల్లా .. కవ్వించే కన్నెపిల్లా .. కోపంగా చూస్తే ఎల్లా .. క్షణంలో అగ్గిపుల్లా' అంటూ ఈ పాట సాగుతోంది. 

మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా .. హారిక నారాయణ్ - సుధాంశు ఆలపించారు. ఈ మధ్య కాలంలో వర్షంలో తడిపే రొమాంటిక్ సాంగ్స్ తగ్గాయి. అలా వర్షంలో సాగే ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి.


More Telugu News