ఎవరికి వారుగా ఈ వెబ్ సిరీస్ చూడటమే బెటర్: 'రానా నాయుడు' ప్రెస్ మీట్ లో వెంకటేశ్
- నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'రానా నాయుడు'
- ప్రధానమైన పాత్రల్లో వెంకటేశ్ - రానా
- ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయన్న వెంకీ
- ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్
వెంకటేశ్ - రానాను ఒకే తెరపై చూడాలని అభిమానులు భావించారు. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తప్పకుండా వస్తుందని అంతా ఆశించారు. అలాంటి వాళ్లందరి ముచ్చటను తీర్చడానికి 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ వేదికపై వెంకటేశ్ మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో వచ్చే వెబ్ సిరీస్ లను ఎవరికి వారే సెపరేట్ .. సెపరేట్ గానే చూస్తున్నారు. అలాంటి కంటెంట్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. మన జాగ్రత్తలో మనం ఉండటం బెటర్. అందరికీ తెలుసు ఈ మధ్య ఏమేం వస్తున్నాయో .. అందుకే ఎవరి ల్యాప్ టాప్ లో వారు చూస్తున్నారు.
"రేపు ఈ వెబ్ సిరీస్ చూసినవారు నేనేదో అలా చేశాను .. ఇలా చేశాను అనేది ఒకటి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో కనిపించే ప్రధానమైన పాత్రలు .. ఆ పాత్రల నేపథ్యం .. అవి అనుభవించే సంఘర్షణలు .. ఆ ఫ్రస్టేషన్ లో అలాంటి సీన్స్ కనిపిస్తాయి. అలా అని భయపడాల్సిన పనిలేదు .. మంచి ఎమోషన్స్ ఉంటాయి. అంతా ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.