గుండెలు బలహీనమవుతున్నాయ్.. ఏపీలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
- గుండెపోటుకు గురైన 17 ఏళ్ల షేక్ ఫిరోజ్
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
- చిలకలూరిపేటలో విషాదకర ఘటన
ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురవడం, కార్డియాక్ అరెస్ట్ లతో కుప్పకూలిపోవడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. గతంలో ఒక వయసు దాటిన వారికి గుండె సమస్యలు వచ్చేవి. ఇప్పుడు టీనేజ్ వయసు వాళ్లు కూడా కార్డియాక్ అరెస్ట్ లకు గురవుతుండటం అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి మరో విషాదకర ఘటన ఏపీలోని చిలకలూరిపేటలో చోటు చేసుకుంది.
ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి షేక్ ఫిరోజ్ నిన్న రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతనిని హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఫిరోజ్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఫిరోజ్ మృతితో అక్కడ విషాదం నెలకొంది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.