నన్ను మతం పేరుతో దూరం పెట్టొద్దు: సినీ నటి పూనం కౌర్ కంటతడి
- పంజాబీ అని తనను దూరం పెడుతున్నారన్న పూనం కౌర్
- తాను కూడా తెలంగాణ బిడ్డనేనని వ్యాఖ్య
- సిక్కు, మైనార్టీ అని విడదీయొద్దని విన్నపం
తనను మతం పేరుతో దూరం పెడుతున్నారని సినీ నటి పూనమ్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ... తనను పంజాబీ అమ్మాయి అని దూరం పెడుతున్నారని ఆమె వేదికపైనే కంటితడి పెట్టుకున్నారు. తాను కూడా తెలంగాణ బిడ్డనేనని చెప్పారు. మతం పేరుతో తనను వెలివేయకండని కోరారు. సిక్కు, మైనార్టీ అంటూ విడదీయవద్దని అన్నారు.
మెడికో ప్రీతి ఘటనపై ఆమె స్పందిస్తూ, ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ తోనే పూనమ్ కౌర్ తన కెరీర్ ను ప్రారంభించారు. తమిళ, హిందీ సినిమాలు కూడా చేశారు. కొన్నేళ్లుగా తెలుగులో హీరోయిన్ గా కాకుండా ఇతర ప్రధాన పాత్రలను కూడా పోషిస్తున్నారు. గత ఏడాది తెలుగులో 'నాతిచరామి' చిత్రంలో నటించారు.