మద్యం సేవించి వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకోవడంతో నాగ్ పూర్ లో ఓ వ్యక్తి మృతి
- వైద్యుల సలహా మేరకే వయాగ్రా తీసుకోవాలి
- లైంగిక సామర్థ్యంకోసం తీసుకునే ట్యాబ్లెట్ల విషయంలో జాగ్రత్త
- కేస్ స్టడీతో హెచ్చరించిన మెడికల్ జర్నల్
- జాగ్రత్తలు పాటిస్తే వయాగ్రాతో గుండె జబ్బులు దూరమని కాలిఫోర్నియా వర్సిటీ రీసెర్చ్ లో వెల్లడి
పీకలదాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు చేసిన ఈ పనితో ఆయన ప్రాణమే పోయింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను మెడిసిన్ జర్నల్ ప్రచురించింది. వైద్యుల సలహా, సూచన లేకుండా వయాగ్రా వాడొద్దని హెచ్చరించింది.
నాగ్ పూర్ లోని ఓ హోటల్ లో ఓ వ్యక్తి మద్యం సేవించాక లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. ఆపై తనతో వచ్చిన మహిళతో గడిపాడు. ఆ మరుసటి రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు విపరీతంగా అవుతుండడంతో ఆయన వెంట వచ్చిన మహిళ హోటల్ సిబ్బంది సాయం కోరింది. అయితే, దీనికి సదరు వ్యక్తి అభ్యంతరం చెప్పాడు. తనకు గతంలోనూ ఇలాగే జరిగిందని, మరేం పర్వాలేదని చెప్పాడు. కాసేపటికి కుదురుకుంటుందని తెలిపాడు. అయితే, పరిస్థితి ఇంకా దిగజారడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఆసుపత్రికి తీసుకొస్తుండగానే చనిపోయాడని తెలిపారు.
పోస్ట్ మార్టం నివేదికలో రక్తం గడ్డకట్టడం వల్లే ఆ వ్యక్తి చనిపోయినట్లు తేలింది. ఆల్కహాల్ తో పాటు వయాగ్రా తీసుకోవడం, గతంలో రక్తపోటు ఉండడమే ఆయన మరణానికి దారితీసిందని బయటపడింది. కాగా, వైద్య సలహా తీసుకోకుండా సొంతంగా వయాగ్రా లాంటి మందులు తీసుకోవడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని హెచ్చరించేందుకే ఈ కేసును ప్రచురించినట్లు జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్ పేర్కొంది.
గుండె జబ్బుల ముప్పు 39 శాతం తగ్గుతుంది..
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలో సరైన జాగ్రత్తలు, వైద్యుల సూచనలతో వయాగ్రా వాడడం వల్ల గుండె జబ్బులను దూరం పెట్టొచ్చని తేలింది. లైంగిక సామర్థ్యం పెంచే ఈ మందులో ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. సగటున 53 ఏళ్ల వయసున్న 70 వేల మందిపై తాము అధ్యయనం జరిపినట్లు వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇందులో భాగంగా వారికి తగు మోతాదులో వయాగ్రా ఇచ్చి పరీక్షించినట్లు వివరించారు. 2006 నుంచి 2020 వరకు జరిగిన ఈ అధ్యయనంలో వయాగ్రా వాడిన వారికి గుండె జబ్బుల ముప్పు 39 శాతం తగ్గినట్లు గుర్తించామని చెప్పారు. ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ జనవరిలో ప్రచురించింది.