ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
- 506 సెక్షన్ కింద నమోదు చేసిన నల్లగొండ వన్ టౌన్ పోలీసులు
- ఎంపీ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసిన చెరుకు సుధాకర్ కుమారుడు
- తన వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చిన ఎంపీ కోమటిరెడ్డి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్ ను తన అభిమానులు చంపేస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా నల్లగొండ జిల్లా రాజకీయాల్లో రాజకీయ దుమారం రేగింది. దీనిపై ఎంపీ వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ విషయంలో ఆయనపై నల్లగొండ జిల్లాలో కేసు నమోదైంది.
సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో 506 (నేరపూరిత బెదిరింపులు) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతానంటూ వెంకట్ రెడ్డి ఫోన్‌లో బెదిరించారని చెరుకు సుహాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని సుహాస్ తెలిపారు. వెంకట్ రెడ్డిపై నల్లగొండ జిల్లా ఎస్పీకి కూడా చెరుకు సుహాస్ సోమవారం ఫిర్యాదు చేశారు.