మహీంద్రా ఆటో నడిపిన బిల్ గేట్స్... మిత్రుడు ఆనంద్ మహీంద్రా స్పందన
- ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్
- మహీంద్రా ట్రియో ఆటోను నడిపిన గేట్స్
- 'చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడీ' అన్న ఆనంద్ మహీంద్రా
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఈ సారి పర్యటనలో ఆయన తన అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే, సమయం దొరికినప్పుడు సరదాగా కూడా గడుపుతున్నారు. మొన్న ఆయన స్వయంగా కిచిడీ వండారు. తాజాగా ఆయన ఆటో నడిపారు. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేయడమే కాక, తన స్పందనను కూడా తెలియజేశారు. 'చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడీ' అని కామెంట్ చేశారు. ఈ సారి మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు మీరు, నేను, సచిన్ టెండూల్కర్ 3 వీలర్ ఈవీ డ్రాగ్ రేస్ పెట్టుకుందామని అన్నారు.
అంతకు ముందు మహీంద్రా ట్రియో ఆటోను నడుపుతున్న వీడియోను బిల్ గేట్స్ షేర్ చేశాడు. కొత్తదనాన్ని కనుక్కోవాలనే తపనలో భారత్ అభిరుచి ఎప్పటికీ ఆశ్చర్యానికి గురి చేయదని బిల్ గేట్స్ అన్నారు. తాను ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపానని ఇది 131 కిలోమీటర్లు (సుమారు 81 మైళ్లు) ప్రయాణించగలదని చెప్పారు. నలుగురు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చని తెలిపారు. ట్రాన్స్ పోర్టేషన్ రంగంలో డీకార్బొనైజేషన్ దిశగా ఎంతో కృషి చేస్తున్న మహీంద్రా వంటి కంపెనీలను చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. మరోవైపు బిల్ గేట్స్, ఆనంద్ మహీంద్రా ఇద్దరూ స్నేహితులనే విషయం తెలిసిందే. హార్వర్డ్ యూనివర్శిటీలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు.