'సత్తిగాని రెండెకరాలు' టీజర్ రిలీజ్ .. 'ఆహా'లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- గ్రామీణ నేపథ్యంలో సాగే 'సత్తిగాని రెండెకరాలు'
- 'పుష్ప' జగదీశ్ ప్రధాన పాత్రగా నడిచే కథ
- కీలకమైన పాత్రలో వెన్నెల కిశోర్
- ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్
మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన పెద్ద సినిమాలు, సంచలన విజయాలను నమోదు చేశాయి. ఈ బ్యానర్ పై ఓటీటీ సినిమాలను నిర్మించడం కూడా మొదలైంది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు రూపొందించిన ఓటీటీ మూవీనే 'సత్తిగాని రెండెకరాలు'.
'పుష్ప' సినిమాలో బన్నీ స్నేహితుడిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్, ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు. అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా అందుకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమవుతోంది.
హీరో ఒక సమస్య నుంచి బయటపడటానికి ఆయనకి 25 లక్షలు అవసరమవుతాయి. అందుకోసం ఆయన తనకున్న రెండెకరాలు అమ్మేయాలని అనుకుంటాడు. ఆ విషయంలో ఆయనకి ఎదురయ్యే పరిస్థితులే ఈ కథ. వెన్నెల కిశోర్ .. మోహనశ్రీ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.