ఇసుక నుంచి తైలం తీయడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది: దేవినేని ఉమ

  • కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లను మార్చారన్న దేవినేని
  • తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టేశారని విమర్శ
  • టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులు 71 శాతం పూర్తయ్యాయన్న మాజీ మంత్రి
  • పోలవరం, రంపచోడవరం నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ ఊరికే దెబ్బతినలేదని, ఇసుక నుంచి తైలం తీయడం వల్లే దానికా గతి పట్టిందని ఆరోపించారు. ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం 71 శాతం పూర్తి చేస్తే జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏడు శాతం పనులు మాత్రమే చేసిందన్నారు.

కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లను మార్చారని ఆరోపించారు. జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని విమర్శించారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓడిపోయినా పర్వాలేదన్న ఉద్దేశంతోనే అక్కడి నిర్వాసితులను జగన్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 మంది ఎంపీలు ఉండి కూడా ఢిల్లీలో డీపీఆర్-2ను ఆమోదించుకోలేకపోతున్నారన్న దేవినేని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ మీడియా ముందుకు ఎందుకు రాలేకపోతున్నారని నిలదీశారు.


More Telugu News