డబ్ల్యూపీఎల్: బెంగళూరుకు కళ్లెం వేసిన ముంబయి బౌలర్లు
- ముంబయిలో ఆర్సీబీ వర్సెస్ ముంబయి ఇండియన్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
- 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది.
ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో, భారీ స్కోరు సాధించాలన్న బెంగళూరు ఆశలు నెరవేరలేదు. లోయరార్డర్ కాస్త ధాటిగా ఆడడంతో బెంగళూరు జట్టుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
కెప్టెన్ స్మృతి మంధన 23, వికెట్ కీపర్ రిచా ఘోష్ 28, కణికా అహూజా 22, శ్రేయాంకా పాటిల్ 23, మేగాన్ షట్ 20 పరుగులు చేశారు. దిషా కసాట్, హీదర్ నైట్ డకౌట్ అయ్యారు.
ముంబయి ఇండియన్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, సలికా ఇషాక్ 2, అమేలియా కెర్ 2, నాట్ షివర్ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్ తీశారు.
అనంతరం 156 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తికా భాటియా 16, హేలీ మాథ్యూస్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.