చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పై కాంగ్రెస్ చార్జిషీట్

  • రవిశంకర్ అవినీతిపరుడంటూ కాంగ్రెస్ చార్జిషీట్
  • అవినీతి సొమ్ముతో అపార్ట్ మెంట్లు కట్టాడని వెల్లడి
  • పదవుల పేరిట సొంత పార్టీ నేతల నుంచే వసూళ్లు చేశాడని ఆరోపణ
  • 2018 నుంచి కోట్లకు పడగలెత్తాడని స్పష్టీకరణ
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకే రవిశంకర్ పై తెలంగాణ కాంగ్రెస్ ఓ చార్జిషీట్ రూపొందించింది. ఎస్సై, సీఐ పోస్టుల పేరుతో రవిశంకర్ లక్షల్లో వసూలు చేశాడని ఆరోపించింది. అవినీతికి పాల్పడడం ద్వారా సంపాదించిన సొమ్ముతో ఖరీదైన అపార్ట్ మెంటులు కట్టాడని వెల్లడించింది. రవిశంకర్ జాతీయ రహదారుల వెంబడి కోట్ల విలువైన స్థలాలు కొన్నారని కాంగ్రెస్ పార్టీ తన చార్జిషీట్ లో వివరించింది. 

నారాయణపూర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ముంపు బాధితులను ఆదుకోలేదని తెలిపింది. పదవులు ఇప్పిస్తానంటూ సొంత పార్టీ నేతల దగ్గరే లక్షలు వసూలు చేశాడని పేర్కొంది. 

ఆఖరికి కూతురి పెళ్లి చేస్తూ సర్పంచులు, ఎంపీటీసీల నుంచి డబ్బు వసూలు చేశాడని కాంగ్రెస్ తన చార్జిషీట్ లో ఆరోపణలు చేసింది. 2018 నుంచి రవిశంకర్ కోట్లకు పడగలెత్తారని స్పష్టం చేసింది.


More Telugu News