మెడికో ప్రీతి కేసును ప్రభుత్వం పథకం ప్రకారం నీరుగారుస్తోంది: బండి సంజయ్

  • వరంగల్ లో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం
  • నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
  • నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్న బండి సంజయ్
ఇటీవల వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసి, నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం తెలిసిందే. సీనియర్ల ర్యాగింగ్, వేధింపులు ఆమె మృతికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. 

ప్రీతి కేసును ప్రభత్వం పథకం ప్రకారం నీరుగారుస్తోందని ఆరోపించారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు పనిచేస్తున్నారని విమర్శించారు. నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు. 

ప్రీతి అంశంపై బీజేపీ మహిళా నేత డీకే అరుణ కూడా స్పందించారు. కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు జరుగుతున్నాయని, ప్రీతి వ్యవహారంలో నిజానిజాలు బయటికి రావాల్సి ఉందని అన్నారు.


More Telugu News