సిసోడియాకు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- లిక్కర్ స్కామ్ లో జ్యుడీషియల్ కస్టడీ
- ఇప్పటికే 5 రోజులు సీబీఐ కస్టడీలో ఉన్న సిసోడియా
- బెయిల్ పిటిషన్ పై ఈ నెల 10న విచారణ
ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కోర్టు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన ఈ నెల 20 వరకు తీహార్ జైల్లో వుంటారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరోజు దాదాపు 8 గంటల సేపు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టగా సీబీఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఈరోజు మరోసారి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరకుండా, జ్యుడీషియల్ రిమాండ్ కోరారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ ను విధించడంతో సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈ నెల 10న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.