జనసేన మాతోనే ఉంది.. ఇంతకంటే ఏం చెప్పలేను: జీవీఎల్

  • దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించామన్న జీవీఎల్
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన విష్ణువర్ధన్ రెడ్డి
  • ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని మండిపాటు
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ బీజేపీ కూటమిలోనే ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైతే ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిందని చెప్పారు. 

మరో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీలో తమ పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరని... అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


More Telugu News