పరుగులో భారతీయుడి రికార్డ్.. 350 కిలోమీటర్లు
- 102 గంటల 27 నిమిషాల్లో లక్ష్యం చేరిక
- డెలీరియస్ వెస్ట్ మారథాన్ విజేత సుకాంత్ సుఖి
- పోటీలో భాగంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానన్న విజేత
ఎంతో మందికి సాధ్యం కాని లక్ష్యాన్ని ఓ భారతీయుడు ఛేదించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన డెలీరియస్ వెస్ట్ (డబ్ల్యూఈఎస్ టీ) మారథాన్ విజేతగా సుకాంత్ సుఖి నిలిచాడు. 350 కిలోమీటర్ల దూరాన్ని 102 గంటల 27 నిమిషాల్లో చేరుకున్నాడు. గత నెల 8 నుంచి 12 వరకు ఈ పోటీలు జరిగాయి. ప్రపంచంలో 200 మైళ్లను ఛేదించిన టాప్-10లో ఒకడిగా సుకాంత్ సుఖిని డెలీరియస్ వెస్ట్ తన వెబ్ సైట్లో పేర్కొంది.
మారథాన్ లో భాగంగా ఎదుర్కొన్న కష్టాల, సవాళ్ల గురించి తెలియజేస్తూ సుకాంత్ సుఖి యూట్యూబ్ లో ఓ వీడియో ఉంచాడు. మారథాన్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ‘‘నా జీవితంలో చేసిన అత్యంత కష్టమైనది ఇదే. మిగిలిన జీవిత కాలం మొత్తం ఇది గుర్తుండిపోతుంది. ప్రమాదకరమైన అడవిలో 350 కిలోమీటర్లు పరుగు తీయడం సాధ్యమేనా? అంటూ’’ ప్రశ్నించాడు.