వరుపుల రాజా భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

వరుపుల రాజా భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
  • గుండెపోటుతో మృతిచెందిన వరుపుల రాజా
  • ప్రత్తిపాడు నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా ఉన్న రాజా
  • రాజా కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • ముగిసిన రాజా అంత్యక్రియలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా హఠాన్మరణం చెందడం తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన రాజాను కుటుంబ సభ్యులు కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ వరుపుల రాజా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రాజా భౌతికకాయంపై టీడీపీ జెండా కప్పారు. వరుపుల రాజా భార్యాపిల్లలను చంద్రబాబు పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

వరుపుల రాజా అంత్యక్రియలు ఈ సాయంత్రం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు వరుపుల రాజాకు నివాళులు అర్పించారు. 

వరుపుల రాజా గతంలో వైసీపీలో కొనసాగారు. ఈ నేపథ్యంలో రాజా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.


More Telugu News