పోలవరం విషయంలో ఎవరిపై చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయిస్తాం: మంత్రి అంబటి రాంబాబు
- పోలవరంను సందర్శించిన అంబటి
- ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష
- చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరంకు నష్టం జరిగిందని ఆరోపణ
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
వరదల కారణంగా డయాఫ్రం వాల్ 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని, పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వీటిని సరిచేస్తేనే మిగతా పనులు ముందుకు సాగుతాయని అన్నారు. ఈ మరమ్మతు పనులకే రూ.2 వేల కోట్లు అవసరమని స్పష్టం చేశారు. దీనిపై నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అధ్యయనం చేసిందని, ఇటీవలే నివేదిక కూడా వచ్చిందని అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.