టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు?: బాలినేని

  • జగన్ మొదటి నుంచి ఓ విజన్‎తో ముందుకు వెళ్తున్నారన్న బాలినేని
  • ప్రజలకు మంచి జరగాలనే విశాఖ రాజధాని అని వెల్లడి
  • పెట్టుబడుల సదస్సుతో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందని వ్యాఖ్య
సీఎం జగన్ మొదటి నుంచి ఓ విజన్‎తో ముందుకు వెళ్తున్న నాయకుడని వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విశాఖ సమిట్‎తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని చెప్పారు. ఏపీలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని తెలిపారు. ఏపీకి పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసే వారికి చెంపపెట్టులా సీఎం జగన్ సమాధానం చెప్పారన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖేష్ అంబానీ లాంటి వ్యాపారవేత్తలు ముందుండి విశాఖ సదస్సును విజయవంతం చేశారని కొనియాడారు. పెట్టుబడుల సదస్సుతో లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్ చేశారు. ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖ రాజధాని అని వెల్లడించారు. అభివృద్ధి చెందిన సిటీని మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చని, అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే రూ. లక్షల కోట్లు కావాలని అన్నారు.


More Telugu News