సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ లో టెన్నిస్ ఆడి యువరాజ్ సింగ్ సందడి
- సానియా, ఇవాన్ కు ప్రత్యర్థిగా మిక్స్ డ్ డబుల్స్ ఆడిన యువీ
- ఆరంభంలో తడబడ్డ క్రికెటర్ కు సానియా చిట్కాలు
- అనంతరం సర్వీస్ లు, షాట్లతో అలరించిన యువరాజ్
కెరీర్ కు వీడ్కోలు పలికిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా హైదరాబాద్ లో ఫేర్ వెల్ మ్యాచ్ ఆడింది. తాను ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్ గడ్డపై చివరిసారి రాకెట్ పట్టి బరిలోకి దిగింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో సానియా..తన డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహన్ బోపన్న, ఇవాన్ డోడింగ్ తో మిక్స్‌డ్ డబుల్స్ లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడి వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సానియాకు మంచి స్నేహితుడైన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్టేడియానికి వచ్చాడు.
సానియా, ఇవాన్ డోడింగ్ జంటకు ప్రత్యర్థిగా బెతానీ మాటెక్ తో సరదాగా కలిసి మిక్స్ డ్ డబుల్స్ మ్యాచ్ ఆడి అలరించాడు. ఆరంభంలో తడబడ్డ యువరాజ్ కు సర్వీస్ ఎలా చేయాలో సానియా చెబుతూ కనిపించింది. అనంతరం యువీ అద్భుతంగా సర్వీస్ చేస్తూ అలరించాడు. ఈ మ్యాచ్ కు హీరో దుల్కర్ సల్మాన్, మహ్మద్ అజారుద్దీన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.