మరోమారు ఓడిన కరాచీ కింగ్స్.. డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లపై అరిచేసిన వాసిమ్ అక్రమ్.. వీడియో ఇదిగో!
- 8 మ్యాచుల్లో ఆరుసార్లు ఓడిన కరాచీ కింగ్స్
- 202 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ఇస్లామాబాద్ యునైటెడ్
- వరుస ఓటములను జీర్ణించుకోలేకపోయిన అక్రమ్
- ఆటగాళ్లపై మండిపాటు
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన కరాచీ ఆరో ఓటమిని మూటగట్టుకుంది. కరాచీ కింగ్స్ నిర్దేశించిన 202 పరుగుల విజయ లక్ష్యాన్ని షాదాబాద్ ఖాన్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. ఎక్స్‌ప్లోజివ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ 41 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
8 మ్యాచ్‌లు ఆడిన కరాచీ కింగ్స్‌కు ఇది ఆరో ఓటమి. వరుస పరాజయాలతో కోపం మీదున్న ఆ జట్టు ప్రెసిడెంట్ వాసిం అక్రమ్ ఆటగాళ్ల మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లపై విరుచుకుపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో అక్రమ్ పౌరుషంగా మాట్లాడుతుండడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అక్కడే కూర్చున్న షోయబ్ మాలిక్ బదులివ్వడం కూడా కనిపించింది.