డబ్ల్యూపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బోణీ
- భారత్ లో డబ్ల్యూపీఎల్ ప్రారంభం
- ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసిన ముంబయి
- 15.1 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలిన గుజరాత్
ముంబయిలో ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్ తో ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 143 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
తొలుత బ్యాటింగ్ లో విరుచుకుపడిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఆపై, గుజరాత్ జెయింట్స్ ను కుప్పకూల్చింది. 208 పరుగుల భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 15.1 ఓవర్లలో కేవలం 64 పరుగులు మాత్రమే చేసి దారుణ పరాజయాన్ని చవిచూసింది.
ఆ జట్టులో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దయాలన్ హేమలత చేసిన 29 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో సలికా ఇషాక్ 4 వికెట్లు తీయగా, నాట్ షివర్ 2, అమేలియా కెర్ 2, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీశారు.