డబ్ల్యూపీఎల్ కు మాంచి ఊపునిచ్చే ఆరంభం... అదరగొట్టిన ముంబయి బ్యాటర్లు

  • భారత్ లో డబ్ల్యూపీఎల్ ప్రారంభం
  • తొలి మ్యాచ్ లో ముంబయి వర్సెస్ గుజరాత్
  • టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్
  • ముంబయి ఇండియన్స్ కు బ్యాటింగ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసిన ముంబయి
భారత్ లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు అదిరిపోయే ఆరంభం లభించింది. గుజరాత్ జెయింట్స్ తో ఆరంభ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేయడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. 

ముఖ్యంగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బౌండరీలతో విరుచుకుపడింది. కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు చేసింది. ఆమె స్కోరులో 14 ఫోర్లు ఉన్నాయి. 

ఓపెనర్ హేలీ మాథ్యూస్ 47 (31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు), అమేలియా కెర్ 45 నాటౌట్ (24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), నాట్ షివర్ 23 (18 బంతుల్లో 5 ఫోర్లు) పరుగులు సాధించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2, ఆష్లే గార్డనర్ 1, తనూజా కన్వర్ 1, జార్జియా వెర్హామ్ 1 వికెట్ తీశారు.


More Telugu News