విజయనగరంలో సందడి చేసిన తమన్నా... వీడియో ఇదిగో!

  • మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రారంభం
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ
  • మలబార్ సంస్థ తనకు కుటుంబం వంటిదని వెల్లడి
  • నమ్మకానికి మారుపేరు అని కితాబు
మిల్కీ బ్యూటీ తమన్నా విజయనగరం విచ్చేశారు. ఇక్కడి రైల్వే స్టేషన్ కు సమీపంలో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రారంభోత్సవంలో తమన్నా పాల్గొన్నారు. తమన్నా వస్తుందని తెలియడంతో అభిమానులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసి తమన్నా ఉత్సాహంగా అభివాదం చేశారు. ఏపీలో ఇది తమకు 16వ షోరూం అని మలబార్ సంస్థ ప్రతినిధులు సిరాజ్ పీకే, తహసిల్ అహ్మద్ వెల్లడించారు. 

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ... మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తనకు ఒక బ్రాండ్ మాత్రమే కాదని, ఓ కుటుంబం వంటిదని తెలిపారు. ఏ నగరంలో మలబార్ షోరూం ఓపెనింగ్ కు ఆహ్వానించినా తాను సంతోషంగా వెళతానని వెల్లడించారు. 

"నా కెరీర్ లో ఎలా ఎదిగానో, మలబార్ సంస్థ కూడా అలాగే ఎదిగింది. కస్టమర్ల నమ్మకాన్ని పొందింది. ఇక్కడ నగలు కొన్న వారి ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది వారు ఈ సంస్థను ఎంతగా విశ్వసిస్తున్నారో. అలాంటి నమ్మకస్తులైన కస్టమర్లను పొందినందుకు మలబార్ సంస్థ వారిని అభినందించాలి" అని తమన్నా పేర్కొన్నారు. 

కాగా, ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు కూడా పాల్గొన్నారు.


More Telugu News