మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

  • మాగుంట రాఘవ రెడ్డి కస్టడీని 14 రోజుల పాటు పొడిగించిన కోర్టు
  • మాగుంట బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ
  • ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీని ఆదేశించిన కోర్టు 
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ నేత మాగుంట రాఘవ రెడ్డి కస్టడీని రౌస్ రెవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆయనకు మరో 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఈ కేసులో మాగుంట రాఘవ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలువురు ప్రముఖుల పాత్ర ఉన్నట్టు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లు వినిపించాయి. ఈ కేసుకు సంబంధించి మూడు వారాల క్రితం వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆయనను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్టు ఈడీ అప్పట్లో ప్రకటించింది. రాఘవరెడ్డిని సీబీఐ గతేడాది అక్టోబర్‌లోనే ప్రశ్నించింది.


More Telugu News