సింహాలు చెట్లు కూడా ఎక్కుతాయా?

  • ఒకే చెట్టుపై పదుల సంఖ్యలో సింహాలు 
  • వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
  • చెట్టెక్కి వేటకు జంతువులను గుర్తించే విధానం
  • వేడి ఎక్కువగా ఉన్నా ఉపశమనం కోసం అలా చేస్తుంటాయ్
చిరుత పులులు చెట్లు ఎక్కుతాయని తెలుసు. మరి సింహాలు? అవి కూడా చెట్లు ఎక్కగలవు. అందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేసిన ఈ వీడియోనే నిదర్శనం. దీన్ని చూసిన వారి కళ్లు పెద్దవి అయిపోతాయి. ఎందుకంటే ఒకటీ, రెండూ కాదు పదుల సంఖ్యలో సింహాలు చెట్టుపైకి ఎక్కి.. కొమ్మలపై హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. పొరపాటుగా ఈ చెట్టు వైపు ఎవరైనా వెళితే ఇక అంతే..!

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2023 సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి ఈ సింహరాజాల వీడియోని షేర్ చేశారు. ప్రకృతిని పరిరక్షించాలని, చెట్టెక్కిన సింహాల వీడియో ఏ ప్రాంతానికి చెందినది? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. సింహాలు నేలపై వేటకు జంతువులను గుర్తించేందుకు ఇలా చెట్లు ఎక్కుతుంటాయి. నేలపై వేడి ఎక్కువగా ఉంటే, చల్లదనం, ఉపశమనం కోసం కూడా చెట్లు ఎక్కుతుంటాయి.


More Telugu News