ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోంది: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు
- ఏపీకి బ్రాండ్ అంబాసడర్ జగనే అన్న అప్పలరాజు
- రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని వ్యాఖ్య
- ఇన్వెస్టర్స్ సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించిందన్న గుడివాడ అమర్ నాథ్
ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసడర్ ముఖ్యమంత్రి జగనే అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఛరిష్మాతోనే ఏపీ గ్లోబల్ సమ్మిట్ లో భారీ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోందని చెప్పారు. భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కాబోతోందని అన్నారు. మరోవైపు విశాఖలో జరగుతున్న ఏపీ ఇన్వెస్టర్స్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజుకు చేరుకుంది.
ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ... జగన్ మాటల మనిషి కాదని, చేతల మనిషి అని అన్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. పలు దేశాల నుంచి ప్రసిద్ధ సంస్థలు సమ్మిట్ లో పాల్గొంటున్నాయని తెలిపారు.