ఆవును జాతీయ రక్షిత జంతువుగా ప్రకటించాలి: అలహాబాద్ హైకోర్టు

  • ఆవును హిందువులు దేవుడి ప్రతినిధిగా భావిస్తారన్న అలహాబాద్ హైకోర్టు
  • గోవును అందరూ గౌరవించాలని వ్యాఖ్య
  • గో సంరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచన
గోవును హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. సాక్షాత్తు ప్రత్యక్ష దైవంగా ఆవును పూజిస్తారు. తాజాగా గోవు గురించి అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ రక్షిత జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యానించింది. గోహత్యను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 

హిందువులకు గోవుపై ఎంతో విశ్వాసం ఉందని... దాన్ని పవిత్రమైన జంతువుగా, దేవుడి ప్రతినిధిగా భావిస్తారని పేర్కొంది. మనది లౌకిక దేశమని... అందువల్ల అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాల్సి ఉంటుందని తెలిపింది. ఆవును అందరూ గౌరవించాలని, దానికి రక్షణ కల్పించాలని చెప్పింది. 

ఉత్తరప్రదేశ్ గోహత్య నిరోధక చట్టం కింద అభియోగాలను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కేసును త్వరగా ముగించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ ను జస్టిస్ షమీమ్ అహ్మద్ సింగిల్ బెంచ్ కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.


More Telugu News