ఆ ఉద్యోగులు పాత పెన్షన్ పథకం ఎంచుకోవచ్చు: కేంద్రం

  • పాత పెన్షన్ విధానంపై కేంద్రం కీలక ప్రకటన
  • 2003 డిసెంబర్ 22కు ముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా జాబ్‌లో చేరిన వారికి ఓపీఎస్ వర్తింపు
  • వన్ టైం ఆప్షన్ కింది ఓపీఎస్‌ను ఎంచుకునేందుకు అనుమతి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానానికి సంబంధించి కేంద్రం తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. 2003 డిసెంబర్ 22కు ముందు విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల ఆధారంగా కేంద్ర సర్వీసుల్లో చేరిన వారు పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) ఎంచుకునేందుకు అనుమతించింది. వన్ టైం ఆప్షన్ కింద ఈ సదుపాయం కల్పించింది. ఈ మేరకు పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం 2003 డిసెంబర్ 22న నేషనల్ పెన్షన్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఉద్యోగ వర్గాల నుంచి అందిన అభ్యర్థనలను పరిశీలించిన మీదట అప్పటి వారికి పాత పింఛను అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.  



OPS

More Telugu News