భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 899 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 272 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా లాభపడ్డ ఎస్బీఐ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా... ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు పెరిగి 59,809కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు లాభపడి 17,594 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.11%), భారతి ఎయిర్ టెల్ (3.30%), రిలయన్స్ (2.46%), ఐటీసీ (2.42%), టాటా స్టీల్ (2.20%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.04%), నెస్లే ఇండియా (-0.17%), ఏసియన్ పెయింట్స్ (-0.17%).