భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు

  • మజ్జిగలో ఎన్నో రకాల పోషకాలు, మంచి చేసే బ్యాక్టీరియా
  • జీర్ణ శక్తి పెరుగుతుంది.. యాసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుంది
  • అసిడిటీతో బాధపడే వారికీ మంచి పరిష్కారం
మజ్జిగకు మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. వేసవిలో శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. మజ్జిగలో మిరియాల పొడి, ధనియాల పొడి, ఎండబెట్టిన అల్లం పౌడర్ వేసుకుని అయినా తీసుకోవచ్చు. 

  • మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రొటీన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బీ12, ప్రొబయాటిక్ అందుతాయి. వీటితో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. 
  • బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ మంచి ఔషధం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పెరుగుకు బదులు మజ్జిగ వాడుకోవాలి. 
  • ఆరోగ్యానికి మంచి చేసే బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్ ఉండడంతో జీర్ణక్రియలకు మేలు జరుగుతుంది. 
  • ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడే వారికీ మజ్జిగతో మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే తీసుకున్న మజ్జిగ కడుపులోని యాసిడ్స్ ను క్లియర్ చేస్తుంది. 
  • అసిడిటీకి మజ్జిగ మంచి ఔషధం. దీనికి మిరియాలు, ధనియాల పొడి, యాడ్ చేసుకోవాలి. 
  • యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడే వారికి మజ్జిగతో మంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయంలోని గోడల లైనింగ్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది.


More Telugu News