పిచ్చెక్కించిన ఇండోర్ పిచ్.. రెండు రోజుల్లో 30 వికెట్లు
- అంతిమ ఫలితం ఏమైందో చూశారుగా అని వ్యాఖ్యానించిన గంగూలీ
- కొన్ని రకాల చర్యలు అవసరమన్న అభిప్రాయం
- టెస్ట్ క్రికెట్ కు అనుకూలమైన పిచ్ కాదంటున్న మాజీ క్రికెటర్లు
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు పిచ్చెక్కించింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించడంతో మూడో రోజే ఆట ముగిసిపోయింది. దీంతో 4, 5వ రోజు కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారు నిట్టూరుస్తున్నారు. ఈ పిచ్ ఫలితం చూసి క్రికెట్ పండితులు సైతం అయోమయానికి గురయ్యారంటే ఆశ్చర్యం కలగక మానదు.
బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు, కెప్టెన్లు, కోచ్ లు చివరికి కామెంటేటర్లు సైతం పిచ్ చూసి బుర్ర గోక్కోవాల్సి వచ్చింది. మాజీ క్రికెటర్, కామెంటేటర్ విధుల్లో ఉన్న మ్యాథ్యూ హెడెన్ స్పందిస్తూ ఈ పిచ్ టెస్ట్ క్రికెట్ కు అనుకూలమైనది కాదన్నాడు. ఆటలో మొదటి రోజు 14 వికెట్లు తీయగా, రెండో రోజు 16 వికెట్లు కూలిపోయాయి. ఇవాళ తొలి సెషన్ తోనే మూడో రోజు ఆట ముగిసిపోయింది.
బీసీసీఐ మాజీ సారథి సౌరభ్ గంగూలీ స్పందిస్తూ ‘అంతిమంగా ఏం జరిగిందో చూడండి’ అని పేర్కొన్నాడు. కొన్ని చర్యలు అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్ కోసం పిచ్ ను ఇంత పేలవంగా రూపొందిచడం పట్ల చాలా వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ ఫలితం ఇంత త్వరగా తేలిపోయేలా ఉండకూడదు. భారత్ తొలి ఇన్నింగ్స్ ను కేవలం 109 పరుగులకే ముగించగా, ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 197 పరుగులు సాధించింది. తిరిగి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు ఓడిపోయింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సులభంగా సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో మూడు పూర్తి కాగా, భారత్ రెండు గెలిచి ఆధిక్యంలో ఉంది.