అనిల్ కుంబ్లే రికార్డును బద్దలుకొట్టిన ఆస్ట్రేలియా స్పిన్నర్ లియోన్
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 111 వికెట్లు పడగొట్టిన కుంబ్లే
- 112 వికెట్లు తీసి కుంబ్లేను అధిగమించిన లియోన్
- మూడో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్
అనిల్ కుంబ్లే... ప్రపంచ దిగ్గజ స్పిన్నర్లలో ఒకరు. తన కెరీర్లో ఎన్నో రికార్డులను సాధించిన కుంబ్లే... టీమిండియాకు హెడ్ కోచ్ గా కూడా పని చేశారు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన ఘనత కూడా కుంబ్లేదే. తాజాగా కుంబ్లే పేరిట ఉన్న ఒక రికార్డును ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ బ్రేక్ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 112 వికెట్లు తీసి... ఈ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు అనిల్ కుంబ్లే (111 వికెట్లు) పేరు మీద ఉంది. భారత్ తో జరుగుతున్న టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో ఉమేశ్ యాదవ్ వికెట్ తీసిన లియోన్ ఆ ఘనతను సాధించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
- నాథన్ లియోన్ - 112 వికెట్లు
- అనిల్ కుంబ్లే - 111 వికెట్లు
- రవిచంద్రన్ అశ్విన్ - 106 వికెట్లు
- హర్భజన్ సింగ్ - 95 వికెట్లు
- రవీంద్ర జడేజా - 84 వికెట్లు