అదానీ గనులకు పూర్తిగా మద్దతిస్తున్నానన్న ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

  • అదానీకి ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు
  • గతంలోనే అదానీకి అండగా నిలిచిన టోనీ అబాట్
  • అదానీ కంపెనీలపై తనకు పూర్తి గౌరవం ఉందన్న మాజీ ప్రధాని
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బ్యాన్ అదానీ అంటూ ఆస్ట్రేలియాలో ఓ వర్గం నిరసనలు కూడా చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్ బర్గ్ లో అదానీ గురించి వచ్చిన అంశాలు తనకు పూర్తిగా తెలియవని అన్నారు. అదానీపై, ఆయన కంపెనీలపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఒకవేళ ఏవైనా అవకతవకలు జరిగినా దాన్ని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయని అన్నారు.

 తొలి నుంచి కూడా అదానీ గ్రూప్ కు టోనీ అబాట్ మద్దతుగా నిలుస్తూనే వస్తున్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే అదానీకి చెందిన కార్మైకెల్ బొగ్గు గనులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. అయితే, న్యాయస్థానం తీర్పును ఖండిస్తూ అదానీకి అబాట్ అండగా నిలిచారు. అదానీ బొగ్గు గనులే ప్రస్తుతం ఇండియాలో విద్యుదీకరణకు దోహదం చేస్తున్నట్టు తెలిపారు. అదానీ గనులకు  తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పారు. 



More Telugu News