సుస్మితా సేన్ కు గుండెపోటు... యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు

  • రెండ్రోజుల క్రితం సుస్మితా సేన్ కు హార్ట్ అటాక్
  • వైద్యులు స్టెంట్ అమర్చారని వెల్లడించిన సుస్మిత 
  • ప్రమాదమేమీ లేదన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టు
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన విషయం ఆలస్యంగా వెల్లడైంది. ఈ విషయాన్ని సుస్మిత స్వయంగా వెల్లడించారు. రెండ్రోజుల కిందట తనకు గుండెపోటు వచ్చిందని, వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, గుండెకు స్టెంట్ అమర్చారని వివరించారు. ప్రమాదమేమీ లేదని డాక్టర్ చెప్పారని సుస్మిత తెలిపారు. 

ఈ ముప్పు నుంచి తనను గట్టెక్కించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నేను క్షేమంగానే ఉన్నానన్న శుభవార్తను అభిమానులతో పంచుకునేందుకే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాల్సి వచ్చిందని వివరించారు.


More Telugu News