గవర్నర్ తమిళిసైపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు రిట్ పిటిషన్
- గవర్నర్ తమిళిసైపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
- గవర్నర్ 10 బిల్లులు పెండింగ్ లో ఉంచారన్న సర్కారు
- ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు సుప్రీంకోర్టుకు చేరింది. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ సర్కారు ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
పెండింగ్ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను పేర్కొన్నారు. గత సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు 10 బిల్లులు గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదని తెలుస్తోంది.
మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్ గ్రేడ్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు తదితర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.