మహిళల ఐపీఎల్ మస్కట్.. శక్తి విడుదల
- ఈ నెల 4 నుంచి ముంబైలో డబ్ల్యూపీఎల్ తొలి సీజన్
- బరిలోకి దిగుతున్న ఐదు ఫ్రాంచైజీలు
- తొలి మ్యాచ్ లో ముంబై, గుజరాత్ జెయింట్స్ ఢీ
ఐపీఎల్ తరహాలో భారత్ లో అమ్మాయిల క్రికెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రాబోతోంది. ఈ నెల 4న ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ముంబై వేదికగా జరిగే ఈ లీగ్ లో ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మెగా లీగ్ కి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక మస్కట్‌ను రూపొందించింది.
దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం విడుదల చేశారు. ఒకచేత్తో బ్యాట్, మరో చేతిలో హెల్మెట్ పట్టుకుని రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్న చీతాను అందులో చూపించారు. దానికి ‘శక్తి’ అని నామకరణం చేశారు. ‘వేగం, ఉగ్రం, అగ్నిని నింపుకున్న ఆమె మైదానాన్ని వెలిగించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే’ అని ట్యాగ్ లైన్ తో షా వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. ఈ నెల 4 జరిగే మొదటి మ్యాచ్ లో ముంబై, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.