నా అంత హ్యాపీగా ఉండేవాణ్ణి నేను ఇంతవరకూ కలుసుకోలేదు: రాంగోపాల్ వర్మ
- పెళ్లి అనే అంశంపై స్పందించిన వర్మ
- ప్రేమను చంపేసేదే పెళ్లి అని వ్యాఖ్య
- విడిపోలేక కలిసుంటున్నవారే ఎక్కువని వివరణ
- పెళ్లి తరువాతనే తనకి జ్ఞానోదయమైందని వెల్లడి
రాంగోపాల్ వర్మ ప్రతి ఇంటర్వ్యూలోను తాను బంధాలకు .. అనుబంధాలకు చాలా దూరమని చెబుతుంటారు. ఎలాంటి ఎమోషన్స్ కి తాను దొరకనని అంటూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెళ్లి అనే అంశం గురించి ప్రస్తావించారు. "పాత రోజుల్లో ఆర్ధికపరమైన స్వేచ్ఛ లేకపోవడం వలన .. ఆమె తిరిగొస్తే పోషించలేమని పేరెంట్స్ అనుకోవడం వలన ఈ జీవితానికి ఇంతే అని లేడీస్ నలిగిపోయేవారు" అన్నారు.
"పెళ్లి అనేది నచ్చకపోతే అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నయనేది చెప్పడానికి అనేక సాధనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు ఆర్ధికపరమైన స్వతంత్రం ఉంటే ఇక కలిసి ఉండే అవకాశాలు ఆటోమెటిగ్గా తగ్గిపోతాయి. నా దృష్టిలో ప్రేమను చంపేసేదే పెళ్లి. ఇద్దరిలోను ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది తగ్గుతూ వస్తుంటుంది. అందువలన పెళ్లి అనేది చావుకు ముందు వచ్చే చావులాంటిదని చెబుతుంటాను" అన్నారు.
"నేనెందుకు పెళ్లి చేసుకున్నానంటే .. అప్పటికి నాకు ఈ విషయాలు తెలియదు కాబట్టి. చేసుకున్న తరువాతనే ఈ జ్ఞానమంతా వచ్చింది. నాకు సంతోషాన్ని ఇవ్వని దేనినైనా నేను పక్కన పెట్టేస్తాను .. అందులో ఒకటి పెళ్లి. ఈ రోజుల్లో విడిపోవడానికి అవకాశం లేక కలిసుంటున్నవారే 80 శాతం మంది ఉంటారు. అసలు మనిషి చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వేరే వారి కోసం బ్రతకడం. ఎవరి కోసం వారు బ్రతకడంలోనే ఆనందం ఉంటుంది. ఈ విషయంలో నా అంత హ్యాపీగా ఉండే పర్సన్ ను నేను ఇంతవరకూ కలవలేదు" అని చెప్పుకొచ్చారు.