ప్రచారంలో దూసుకుపోతున్న రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెనుకబడినట్టు?
- చాలా ముందే అమెరికాకు చేరిన రామ్ చరణ్
- అక్కడి టీవీ చానళ్లతో ఇంటర్వ్యూలు, కార్యక్రమాలు
- తన బ్రాండ్ బలోపేతంలో సక్సెస్
- బలమైన పీఆర్ లేకపోవడంతో కనిపించని ఎన్టీఆర్ ప్రచారం
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడంపై రకరకాల వదంతులు వ్యాప్తి అవుతున్నాయి. ముందు నుంచీ అంగీకరించిన సినిమా చిత్రీకరణ పనుల వల్లే జూనియర్ ఎన్టీఆర్ రాలేదని, తాము జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించామని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుల పాత్రల్లో నటించారు. రాజమౌళి తీసిన ఈ సినిమాను అంతర్జాతీయంగా పలు అవార్డులు వరిస్తున్నాయి. జపాన్ లో విడుదల సందర్భంగా, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. కానీ, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ జాడలేకుండా పోయింది. ఎక్కడ చూసినా, ఆర్ఆర్ఆర్ అంటే రామ్ చరణ్ అన్నట్టు తెగ క్రేజీ సంపాదించుకుంటున్నారు.
ముఖ్యంగా అమెరికన్ టీవీ చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియా ప్రచారాన్ని పొందడంలో రామ్ చరణ్ తేజ్ సక్సెస్ అయ్యారు. సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లకు ఎంపిక కావడంతో, రామ్ చరణ్ 20 రోజుల ముందే అమెరికా వెళ్లి అక్కడి మీడియాతో మమేకం అవుతున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్ రామ్ చరణ్ నటనని మెచ్చుకోవడం కూడా పరోక్షంగా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. ఈ సానుకూలతల మద్దతుతో రామ్ చరణ్ బ్రాండ్ ను బలోపేతం చేసుకుంటున్నారు. తాను అమెరికా సినీ పరిశ్రమతోనూ భాగస్వామి కావాలని అనుకుంటున్నట్టు చరణ్ ప్రకటించాడు.
అయితే ప్రధానంగా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వెనుకబడినట్టు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు లోగడ ఎస్ఎం కోనేరు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి కాస్త మెరుగైన ప్రచారమే ఉండేది. ఆయన తర్వాత ఇప్పుడు ఆ వ్యవహారాలను ఎవరూ చూడడం లేదు. ఎన్టీఆర్ ను సహాయ నటుడిగా పీవీఆర్ సంస్థ తన అధికార హ్యాండిల్ పై పేర్కొనడం దేనికి సంకేతం? దీన్ని ఖండించే వారు కూడా లేరు. రామ్ చరణ్ కు బలమైన పీఆర్ కలిసొస్తోందని, జూనియర్ ఎన్టీఆర్ కు ఈ విషయంలోనే లోటు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.