బ్యాంకులు ఇకపై వారంలో ఐదు రోజులే?

  • వారానికి ఐదుల రోజు పని విధానం కోరిన ఉద్యోగుల ఫోరమ్
  • వారి డిమాండ్‌ ను పరిశీలిస్తామన్న బ్యాంక్స్ అసోసియేషన్
  • కొత్త నిబంధన అమల్లోకి వస్తే పెరగనున్న పని వేళలు
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ చేస్తున్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్టు ఇండియా బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) తెలిపింది.

ప్రస్తుతం రెండో, నాలుగో శనివారాలు మినహాస్తే వారికి ఆరు రోజులు పని చేస్తున్నారు. అయితే, కొత్త విధానం అమల్లోకి వస్తే ఇకపై అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ విధానం అమలు చేయాలంటే పని వేళలు పెంచాల్సి ఉంటుంది. వారంలో ఐదు పని దినాల్లో రోజుకు 40 నిమిషాల పాటు పని వేళలు పెంచాలి. ప్రతి రోజూ ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు ఉండే అవకాశం ఉంటుంది.


More Telugu News