వ్యాధుల గురించి చెప్పే స్మార్ట్ టాయిలెట్
- స్మార్ట్ టాయిలెట్ ను అభివృద్ధి చేసిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వ్యాధుల గుర్తింపు
- టాయిలెట్ బేసిన్ లో విడుదల చేసిన మల, మూత్రాల విశ్లేషణ
ల్యాబ్ కు వెళ్లి రక్త, మల, మూత్ర నమూనాలు ఇచ్చి, పరీక్షా ఫలితం వచ్చేంత సమయం లేకపోతే..? టాయిలెట్ కు వెళ్లి వస్తే చాలు.. మీకున్న సమస్యలపై రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇలాంటి స్మార్ట్ టాయిలెట్ ను క్యాలిఫోర్నియాలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. మల మూత్ర విసర్జన ఆధారంగా పరీక్షా ఫలితాలను టాయిలెట్ ప్రాసెస్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ల సాయంతో టెక్నాలజీ స్క్రీనింగ్ పై ఫలితాలు కనిపిస్తాయి. ఇది క్లౌడ్ ఆధారిత టెక్నాలజీకి అనుసంధానమై ఉంటుంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటర్ల సాయంతో ఈ స్మార్ట్ టాయిలెట్ ను పరీక్షించి చూశారు.
ఈ ప్రెసిషన్ హెల్త్ టాయిలెట్ ఆవిష్కరించినది స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకుడు, డాక్టర్ సీంగ్ మిన్ పార్క్ కావడం గమనార్హం. అన్ని ముఖ్యమైన ఆరోగ్య విషయాలను స్మార్ట్ టాయిలెట్ పరీక్షించడమే కాకుండా, 87 రోజులకు సరిపడా యూజర్ డేటాను భద్రంగా ఉంచుతుంది. దీన్ని గృహ ల్యాబ్ గా అభివర్ణిస్తున్నారు. మనుషులు టాయిలెట్ బేసిన్ లో విడుదల చేసే మలం, మూత్రం నుంచి కీలకమైన సమాచారన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రాబట్టేందుకు టాయిలెట్ ను డిజైన్ చేసినట్టు వ్యవస్థాపకులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావాలని కోరుకుందాం.