పార్కులో లిజార్డ్ ల మధ్య ఫైటింగ్

  • కోల్ కతాలోని ఐఐఎంలో కనిపించిన దృశ్యం
  • షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా
  • మల్లయుద్ధం మాదిరిగా కొట్లాడుతున్న లిజార్డ్స్
మనుషుల మధ్యేనా గొడవలు, కొట్లాటలు..? అనుకోవద్దు. మనుషుల మాదిరే జంతువుల్లోనూ ఈ ఘర్షణలు, వైరాలు, పొట్లాట ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ వీడియో. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోని షేర్ చేశారు. ‘‘కోల్ కతాలోని ఐఐఎంలో ఉదయమే కనిపించిన దృశ్యం ఇది. వివాదాల్లో ఎలా నెగ్గుకు రావాలో నేర్చుకోవచ్చు’’ అంటూ నందా ట్వీట్ చేశారు.

‘‘నీటి మడుగు ఒడ్డున రెండు పెద్ద లిజార్డ్ లు (రాక్షస బల్లులు, మొసళ్ల రూపంలో ఉన్న) మల్లయుద్ధం మాదిరిగా కలబడుతుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అచ్చం మనుషుల మాదిరే ఇవి గొడవపడుతున్నాయి. తమ ప్రాంతంలో ఆధిపత్యం కోసం లేదంటే ఆడ లిజార్డ్ కోసం ఇవి ఫైటింగ్ చేస్తుండొచ్చని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అంతేకానీ, సంతానం కోసం అయితే అవి కలబడవని, ఆ సమయంలో నేలపైనే ఉంటాయని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ఇవి ఏమీ హాని చేయవని, ఐఐఎం క్యాంపస్ లో దశాబ్దాలుగా ఉన్నాయని ఓ యూజర్ పేర్కొన్నాడు.


More Telugu News