నారా లోకేశ్ పాదయాత్ర 32వ రోజు షెడ్యూల్

  • చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం నుంచి ఈనాటి పాదయాత్ర ప్రారంభం
  • బీసీ, ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ కానున్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న టీడీపీ శ్రేణులు, అభిమానుల సంఘీభావంతో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈనాటి పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం నుంచి ప్రారంభమయింది. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర 410 కిలోమీటర్ల దూరం కొనసాగింది. నిన్న ఆయన 13 కిలోమీటర్ల దూరం నడిచారు. 

ఈనాటి లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్:

  • ఉదయం 8 గంటలకు గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
  • 8.10 గంటలకు పోలవరపు ఇండ్లు గ్రామంలో బీసీ నాయకులతో మాటామంతీ.
  • 10.20 గంటలకు దామలచెరువులో గ్రామస్తులతో భేటీ. 
  • 10.40 గంటలకు దామలచెరువులో ముస్లిం సామాజికవర్గీయులతో ముఖాముఖి.
  • మధ్యాహ్నం 12.15 గంటలకు కొండేపల్లి క్రాస్ వద్ద భోజన విరామం.
  • 2.20 గంటలకు కొండేపల్లి క్రాస్ వద్ద రైతులతో ముఖాముఖి.
  • 3.00 గంటలకు కొండేపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర పునః ప్రారంభం.
  • సాయంత్రం 4 గంటలకు మొగరాల గ్రామస్థులతో మాటామంతీ.
  • 5.00 గంటలకు పుంగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
  • 6.15 గంటలకు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం కొమ్మురెడ్డిపల్లి విడిది కేంద్రంలో బస.


More Telugu News